calender_icon.png 16 September, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్తవ్య నిబద్ధత ప్రజాసేవ భావానికి గుర్తింపు: జిల్లా ఎస్పీ మహేష్ బిగి తే

16-09-2025 04:59:07 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు దేవయ్య మానేరు వాగులో చిక్కుకోగా జిల్లా DRF టీంలోని  కానిస్టేబుల్ సురేందర్ ధైర్యసాహసంతో తక్షణమే స్పందించి రైతును సురక్షితంగా రక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్. కార్యాలయంలో కానిస్టేబుల్. సురేందర్‌ను అభినందించి, ఆయన చూపిన కర్తవ్యనిబద్ధత, ప్రజాసేవ భావానికి గుర్తింపుగా ప్రశంస పత్రం అందజేసి “ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేసే పోలీసు సిబ్బంది సమాజానికి ఆదర్శప్రాయులు అని కొనియాడారు.