16-09-2025 04:50:51 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల త్రిశక్తి క్షేత్రంలో నాగారం గ్రామంలో గల శ్రీ సాయి కృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ సేవా సంస్థ వారు త్రిశక్తి క్షేత్రంలో నిర్వహించే నవరాత్రోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవాలయం గేటు వద్ద నుండి ధ్వజస్తంభం వరకు గల ప్రాంతంలో బండలు ఏర్పాటు కోసం ఆర్ధిక సహకారం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ వారు మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో ఇటువంటి సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇది అమ్మవారు కలిగించిన అదృష్టంగా భావిస్తున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేవాలయాలు మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మలని, వాటిని సంరక్షించుకోవడం మన కర్తవ్యమని, అమ్మవార్లకు సేవ చేసే భాగ్యం ఎల్లప్పుడు కలిగించాలని సంస్థ వారు కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.