calender_icon.png 27 July, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే అండర్ బ్రిడ్జి పనుల పూర్తితో కార్మికులకు తొలిగిన కష్టాలు

26-07-2025 08:49:34 PM

మణుగూరు,(విజయక్రాంతి):  కార్మికుల విధి నిర్వహణలో రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్దేశించిన లక్ష్యాల సాధన కోసం కష్టించి పనిచేసే కార్మికులకు ఏరియా జిఎం రామచందర్ మెరుగైన  సౌకర్యాలు కల్పించడం అభినందనీయమ ని, టీబీజీకేఎస్  వైస్  ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వ ర్లు అన్నారు.  ఓపెన్ కాస్ట్ 2, కె.పి యూ జి గనుల వైపు  వెళ్ళే రహదారి వెంబడి ఉన్న  రైల్వే అండర్ బ్రిడ్జి మరమ్మ త్తుల పనుల కోసం సుమారు రూ.10 లక్షల నిధులు వెచ్చించి రెండు నెలల వ్యవధిలో ఆ పనులను పూర్తి చేసి నేడు కార్మికులకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

అండర్ బ్రిడ్జి పనుల సమయంలో  కె.సి హెచ్ పి నుంచి దారి మళ్లింపు చర్యలు చేపట్టిన యాజమాన్యం  కార్మిక రక్షణ చర్యలను  దృష్టిలో ఉంచు కొని తాత్కాలిక  లైటింగ్ ఏర్పాటు చేసి కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చూసిందని ఆయన గుర్తు చేశారు. వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఇబ్బందులను, బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని, కె సి హెచ్ పి మీదుగా తాత్కాలిక స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని తమ సంఘం విజ్ఞాపనకు స్పందించిన జిఎం అండర్ బ్రిడ్జి పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం పట్ల నాగేల్లి యాజమాన్యా నికి, అధికారులకు కృత జ్ఞతలు తెలిపారు.