26-07-2025 08:47:29 PM
బెజ్జంకి: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జ్ కన్నబోయిన ఓదేలు అన్నారు. శనివారం బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, నేటి నుంచి బీజేపీ కార్యకర్తలు పట్టుదలతో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపి పార్టీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని, మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలను జెడ్పీటీసీ స్థానన్ని ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ గెలుపు నాకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చ కార్యదర్శి కరివేద మైపాల్ రెడ్డి. మండల అధ్యక్షులు కొలిపాక రాజు,సాన వేణు బుర్ర మల్లేశం, అనిల్ రావు, దొమ్మట రాములు, రామచంద్రం, గైని రాజు, బండిపెల్లి సునీత,సంగ రవి, రమేష్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.