calender_icon.png 27 July, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రేశం రోడ్డు దుస్థితిపై బీజేపీ ఆందోళన

26-07-2025 08:49:47 PM

వరి నాట్లు వేసి నిరసన..

పటాన్ చెరు: పటాన్ చెరు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి ఇంద్రేశం మీదుగా చిన్నకంజర్ల, పెద్దకంజర్లతో పాటు శివనగర్ వైపు రోడ్డు పెద్ద పెద్ద గుంతలతో అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి(BJP District President Godhavari Anji Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఇంద్రేశం రోడ్డు గుంతల మయంగా మారిన ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. గత మూడు రోజులుగా  కురుస్తున్న వర్షాలకు గుంతలు తేలిన ఇంద్రేశం రోడ్డులో నీళ్లు నిలిచాయి. బీజేపీ పటాన్ చెరు మండల అధ్యక్షుడు వీరేశం ఆధ్వర్యంలో ఇంద్రేశం రోడ్డుపై బీజేపీ నాయకులు, ప్రయాణికులు శనివారం ఉదయం ఆందోళనకు దిగారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత ఆరు సంవత్సరాలుగా రోడ్డు రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, ప్రయాణికులతో కలిసి గుంతలు తేలిన రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. తక్షణమే ప్రభుత్వం రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు, జిన్నారం, అమీన్ పూర్ మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.