calender_icon.png 20 August, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు విద్యార్థుల ఎంపిక

20-08-2025 06:31:46 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశానికి పలువురు విద్యార్థులను ఎంపిక చేశారు. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో గిరిజన విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 19 మంది దరఖాస్తు చేసుకోగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం విద్యార్థులను ఎంపిక చేసేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో డ్రా నిర్వహించారు. మొత్తం ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేశారు.కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంగీత తదితరులు పాల్గొన్నారు.