20-08-2025 07:04:20 PM
ప్లాస్టిక్ రహిత బ్యాగులను వాడాలి
బోథ్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలని ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ పేర్కొన్నారు. బుధవారం సోనాల మండల కేంద్రంలో జరిగిన వారసంతలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్లాస్టికేతర బ్యాగులనే వాడాలంటూ అవగాహన కల్పిస్తు, ప్లాస్టిక్ రహిత బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుల అరుణ్ మాట్లాడుతు ప్లాస్టిక్ అనే భూతం పర్యావరణాన్ని, నాశనం చేస్తూ, కాలుష్య కారినిగా తయారైందని ప్లాస్టిక్ ఉపయోగం వల్ల నీరు భూమిలో ఇంక కుండా పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందన్నారు.