calender_icon.png 20 August, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత నేరస్తుల బైండోవర్

20-08-2025 06:28:52 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు  పాత నేరస్తులను బుధవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు టూ టౌన్ ఎస్సై చిలుముల కిరణ్ కుమార్ తెలిపారు. గత సంవత్సరం వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవలకు కారణమైన వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఈసారి గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని, శాంతియుతంగా పండుగ వేడుకలను జరుపుకోవాలని తెలిపినట్లు చెప్పారు . అదేవిధంగా పోలీసు శాఖ సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై కిరణ్ కుమార్ చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని కోరారు.