calender_icon.png 20 August, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవ్వంపల్లి ఇంట విషాదం

20-08-2025 06:55:27 PM

అనారోగ్య సమస్యలతో రెండో అన్న రాజేశం మృతి రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల నివాళి

కరీంనగర్,(విజయక్రాంతి): మానకొండూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇంట విషాదం చోటుచేసుకుంది. బుధవారం  రెండో సోదరుడు కవ్వంపల్లి రాజేశం (67)తుది శ్వాస వదిలారు. రాజేశం గత నెల రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో అధునాతన వైద్య చికిత్స అందినప్పటికీ పరిస్థితి విషమించిపోవడంతో రాజేశంను హైదరాబాద్ ఆసుపత్రి నుంచి కరీంనగర్ లోని ఇంటికి తరలించారు.

ఇంటికి చేరిన కొద్దిసేపటికే ఆయన తుది శ్వాస విడిచారు. రాజేశం కు భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు. మృతి విషయం తెలియగానే జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు అధికారులు రాజేశం  స్వగృహానికి తరలివచ్చి ఆయన భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు రాజేశం కుటుంబ సభ్యులను, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ఓదారుస్తూ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కరీంనగర్ లోని వాల్మీకి నగర్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర అంగడి బజార్, గాంధీ రోడ్ మీదుగా కిసాన్ నగర్ లోని శ్మశాన వాటికకు చేరింది.అంతకు ముందు కిసాన్ నగర్ లోని చర్చ్ లో రాజేశం పార్థివ దేహానికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  అనంతరం కిసాన్ నగర్ లో గల గ్రేవ్ యార్డ్ లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.