calender_icon.png 20 August, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఐ రాష్ట్ర మహాసభల్లో జిల్లా నాయకులు

20-08-2025 07:01:00 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ నాలుగవ రాష్ట్ర మహాసభలకు జిల్లా నాయకులు హాజరయ్యారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరుగుతున్న మహాసభలో రాష్ట్ర నాయకుడు బద్రి సత్యనారాయణ జిల్లాలో విద్యార్థి, యువజన, రైతు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా పోడు భూముల సమస్య జటిలంగా ఉందని,ప్రభుత్వం విడుదల చేసిన జీవో 49 రద్దు చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.సిర్పూర్ పేపర్ మిల్ కంపెనీలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదని పేర్కొన్నారు.