20-08-2025 06:58:48 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ విద్యార్థులకు సూచించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలన అనే అంశంపై అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఎక్కువగా యువతనే ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతుందని వీటికి దూరంగా ఉండాలని కోరారు. గంజాయి రవాణా దారులు ఎక్కువగా విద్యార్థుల పైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నారని వారి వలలో పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించిన అనుమానాస్పదంగా సంచరించిన వారి కదలికలను గమనించి పోలీసులకు తెలియపరచాలని కోరారు.