calender_icon.png 20 August, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరసింహారెడ్డి కాలేజీలో ఓరియంటేషన్ డే

20-08-2025 07:07:02 PM

మేడ్చల్,(విజయక్రాంతి): మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం ఓరియంటేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాళోజి పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణస్వామి, గౌరవ అతిథిగా వక్త డీజీ రామమూర్తి, ప్రత్యేక అతిథులుగా ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం రెడ్డి చాముండేశ్వరి, టాటా గ్రూప్ సీనియర్ మేనేజర్ నీరజాసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ సి.నారాయణ స్వామి మాట్లాడుతూ... విద్యార్థులు శ్రద్ధతో చదివి భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవాలన్నారు.

తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలన్నారు. గురువు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. గౌరవ అతిథి రామ్మూర్తి తల్లిదండ్రుల కలను నెరవేర్చాలన్నారు. అమ్మ కవిత చెప్పి తల్లి ప్రాముఖ్యతను వివరించారు. సైకాలజిస్ట్ డాక్టర్ అన్నమరెడ్డి చాముండేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ క్రమశిక్షణతో ఉండాలని, కొత్తగా ఆలోచించినప్పుడే ఇంజనీరింగ్ విద్యలో రాణిస్తారు