calender_icon.png 25 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెయిన్‌బో షీల్ ప్రివిలేజ్ కార్డు ఆవిష్కరణ

25-01-2026 12:28:41 AM

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): రెయిస్ బో, బర్త్ రైట్ హాస్పిటల్స్ వారు మాతృత్వ సంరక్షణకు అవసరమైన ఒక సమగ్రమైన వైద్య ప్రయోజనాలు చేకూర్చే రెయిన్బో షీల్ ప్రివిలేజ్ కార్డును శనివారం ప్రారంభించారు. ఈ కార్డు గర్భం ధరించుటకు ముందు నుంచి బిడ్డ జన్మించి ఎదిగేవరకు అన్ని దశలలోనూ ఆ కుటుంబాన్ని వైద్యపరంగా ఆదుకుంటుంది. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ, శ్రేయస్సు, బిడ్డల పెంపకంలో మద్దతు, జీవనశైలి విధానం అన్ని రెయిన్బో షీల్ ప్రీవిలేజ్ కార్డు పరిధిలో మిళితమై, మాతృత్వం, ప్రారంభ దశ పెంప కం సులభతరం చేస్తుంది. ఈ కార్డు కలిగిన వారు డిజిటల్ టీకా ట్రాకింగ్, అపాయింట్ మెంట్ పొందుటలో ప్రాధాన్యత, నిపుణులైన వైద్యులను సంప్రదించుట, బండిల్ద్ టీకా ప్రయోజనాలు, సులభంగా హాస్పటల్ సందర్శన, ఉత్తమ సంరక్షణా ప్రణాళిక పొందుతారు. 

రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్రరాలి దలాల్ మాట్లాడుతూ, ’ ‘రెయిస్బో ప్రివిలేజ్ కార్డ్ కుటుంబాలు తమ జీవితంలోని అతి ముఖ్యమైన గర్భం దాల్చిన దశలలో ఎలాటి క్లిష్టత లకు తావులేకుండా ఉత్తమ వైద్య సేవలను అందించుటకు ప్రవేశ పెట్టామన్నారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ, షీల్ ప్రివిలేజ్ కార్డ్ ద్వారా తల్లిదండ్రులకు ఈ దశలో అవసరమైన అ న్ని విశ్వసనీయ వైద్యసేవలు సలహాలు వం టి అన్నింటిని అందించాలని ఆశిస్తున్నా మ న్నారు. గైనకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్ర ణతిరెడ్డి, రెయిన్బో షీల్ ప్రివిలేజ్ కోం రె యిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బటర్ ఎసెన్షియ ల్స్ అవుట్లెట్లలో నమోదు చేసుకోవచ్చును.