26 April, 2026 | 2:47 AM

మే 2 వరకూ వర్షాలే..

26-04-2026 01:27 AM

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): మే 2వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురువనున్నాయి. అలాగే నేటి నుంచి మూడు రో జుల పాటు 1 నుంచి 2 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముంది. ఈమేరకు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి.

ఆదివారం ఉమ్మడి మెదక్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. సోమవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో, మంగళవారం మంచిర్యాల, నిర్మల్, సిద్ధిపేట్, భువనగిరి, రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.