01-06-2025 12:41:05 AM
సంప్రదాయ పార్టీలకు భిన్నంగా పార్టీ లైన్ పవర్‌ఫుల్ అని చెప్పుకునే బీజేపీలో రాజాసింగ్ రూటే సపరేటు అని నిరూపించుకుం టున్నారు. పార్టీ నేతలపైనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ధిక్కార స్వరం వినిపిస్తు న్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యమే. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కరెక్టేనని.. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్‌ఎస్‌తో కలిసిపోతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ అభ్యర్థులు కూడా ఎక్కడి నుంచి పోటీచేయాలనేది సైతం బీఆర్‌ఎస్ నేతలే డిసైడ్ చేస్తారని గతంలోనూ ఇదే జరిగిందని పేర్కొనడం చూస్తే ఆయన నేరుగా పార్టీ రాష్ట్ర ముఖ్యులపైనే విమర్శలు ఎక్కుపెట్టారని భావించవచ్చు.
గతంలో కేంద్రమంత్రి బండి సంజయ్..రాజాసింగ్ ఇంటికి వెళ్లి కలిసి పార్టీలో అంతా బాగుందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కవిత ఇష్యూలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కమలం పార్టీ ముఖ్యనేతల్లో కయ్యాలు కరెక్టే కావొచ్చు అని కామన్ పీపుల్ కూడా ఫీల్ అవుతున్నారు. విజయభాస్కర్