calender_icon.png 22 October, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయ ఆదాయానికి గండి!

22-10-2025 01:53:16 AM

-పక్కదారి పడుతున్న సరుకులు

-ఉన్నతోద్యోగి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 21 (విజయక్రాంతి): జిల్లాలో దక్షిణ కాశీ పేరుగాంచిన వేములవాడ అది రాజన్న ఆలయ సరుకు లు పక్కదారి పడుతున్నాయి. ఆలయంలోని ముఖ్యమైన విభాగంలో పనిచేస్తున్న ఉన్నతోద్యోగి ఒకరు తన విభాగం నుంచి అందినం త సరుకులను జార వేస్తూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న వైనం బయటప డింది.శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి యాదగిరిగుట్ట నుంచి బదిలీపై వచ్చిన వి. వెంకట ప్రసాద్ ( రాజు) పర్యవేక్షకుడు ప్రస్తు తం బద్దిపోచమ్మ ఆలయం, నాంపల్లి గుట్ట సూపరెంటెండెంట్‌గా,  అలాగే ముఖ్య విభాగమైన గోదాం సూపరెండెంట్ గా సైతం ప నిచేస్తున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంట స మయంలో  తన వద్ద పని చేసే లేబర్ ద్వారా గోదాం నుంచి సరుకులు తన సొంత కారు లో టీజీ1ఓసీ టీజీ 0841 దర్జాగా తరలిస్తు న్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇది మొదటిసారి కాదని, గోదాం సెక్షన్ కి వచ్చినప్పటి నుంచి తన కింది స్థాయి సిబ్బందిని నయనా, భయానా బెదిరించి సామాన్లు జా రవేస్తుంటాడన్న విమర్శలు ఉన్నాయి. గతం లో యాదగిరిగుట్టలో కూడా ఇలాంటి సం ఘటనలకు పాల్పడ్డారని, ప్రస్తుతం వేములవాడకు బదిలీపై వచ్చిన ఉన్నతాధికారులు అండదండలు ఉన్నాయన్న ధీమాతో తాను ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రజల్లో మొదలైంది.