calender_icon.png 1 September, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో

01-09-2025 03:09:39 PM

కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటాం

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ 

దేవరకొండ: కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపైన కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్(Former MLA Ramavath Ravindra Kumar) అన్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)పై సీబీఐ విచారణకు ఆదేశించడం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కొండమల్లెపల్లి మండల కేంద్రంలో సోమవారం భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని వారు తెలిపారు. సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే అని ఆయన తెలిపారు.

నిన్నటిదాకా సీబీఐపైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చారు వారు అడిగారు. దీని వెనుక ఉన్న శక్తులు వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.బీజేపీ-కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలి అని,ఇది కేసీఆర్ గారిపైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు.. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు,యువజన విభాగం నాయకులు, విద్యార్ది విభాగం నాయకులు,తదితరులు ఉన్నారు.