calender_icon.png 3 August, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల అభ్యున్నతే లక్ష్యం

03-08-2025 12:30:29 AM

  1. పెద్దపల్లి జిల్లాలో వీ హబ్ ఉప కేంద్రం 
  2. మహిళల కోసం మంథనిలో పారిశ్రామిక పార్క్ 
  3. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
  4. మంథనిలో రేషన్ కార్డుల పంపిణీ

జయశంకర్ భూపాలపల్లి/మంథని, ఆగస్టు- 2 (విజయ క్రాంతి): పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతోందని ఐటీ, పరిశ్రమలు, శాస నసభ వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం మంథనిలో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపి ణీ, మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంథని పట్టణంలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను, రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో సీసీ రోడ్డు ను మంత్రి ప్రారంభించారు.

మంథని పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల పైలాన్, గ్రామ పంచాయతీ భవనాలకు, ఎక్లాస్పూర్ గ్రా మంలో పాఠశాలలో బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలర్ మండలం తాడిచర్ల గ్రామం లో సహకార సంఘం కార్యాలయం, గోదాం, గ్రంథాలయ భవ నం, సీసీ రోడ్డు పనులు, పిఎసిఎస్ ఆర్చి గేటు నిర్మాణ పనులను, తహసిల్దార్ కార్యాలయ ప్రహరీ పనులను మంత్రి ప్రారంభించారు.

ఆయా సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజలకు రేషన్ కార్డుల జారీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నూతన రేషన్ కార్డులతో పాటు 50 నుంచి 60 రూపాయల విలువ చేసే సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. రేషన్ ద్వారా దొడ్డు బి య్యం సరఫరా చేయడం ద్వారా రీసైక్లింగ్ గురై అక్రమార్కులు మాత్రమే బాగు పడ్డారని విమర్శిం చారు.

మహిళలకు వ్యాపార నైపుణ్యాలలో శిక్షణ అందించేందుకు వీ-హబ్ ఉప కేంద్రం పెద్దపెల్లి జిల్లాలో ఏర్పా టు చేస్తామని మంత్రి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద డైయిరీ, పౌల్ట్రీ ఫార్మ్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు.

మంథనిలో పెద్దపల్లి కలెక్టర్ కో య శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి వేణు, గ్రం థాలయ సంస్థ చైర్మన్ నన్నయగౌడ్, ఆర్‌డిఓ సురేష్, పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి గ్రం ధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, సింగిల్ విండో చైర్మన్ ఇర్ఫా మొండయ్య, సహకార అధికారి వాలియనాయక్ పాల్గొన్నారు.