21 August, 2026 | 2:33 AM

రాజీవ్‌గాంధీ సేవలు దేశానికి చిరస్మరణీయం

21-08-2026 01:51 AM

డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఆగస్టు 20 : మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను ఆమె స్మరించుకున్నారు. దేశాన్ని ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు.

యువతకు ప్రాధాన్యతనిస్తూ, సమాచార సాంకేతిక రంగం అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు దేశ ప్రగతికి ఎంతో దోహదపడ్డాయని అన్నారు. దేశంలో టెలికాం, కంప్యూటర్ రంగాల విస్తరణకు రాజీవ్ గాంధీ తీసుకున్న చర్యలు భవిష్యత్ భారత నిర్మాణానికి బాటలు వేశాయని తెలిపారు.

రాజీవ్ గాంధీ ఆశయాలను, ఆలోచనా విధానాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, కౌన్సిలర్ లు గడ్డం రాజు, రమేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.