21 August, 2026 | 5:03 AM

దేశ నిర్మాణంలో రాజీవ్ గాంధీ పాత్ర చిరస్మరణీయం

21-08-2026 01:22 AM

ఆళ్ళపల్లి ఆగస్టు 20 (విజయక్రాంతి): మండల కేంద్రంలో బుధవారం మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాసం శ్రీకాంత్ గ్రామ సర్పంచ్ సుస్మిత ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాసం శ్రీకాంత్ మాట్లాడుతూ 21వ శతాబ్దంలోకి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.

కంప్యూటర్విప్లవం, టెలికాంవిప్లవం, పంచాయతీరాజ్ వ్యవస్థ, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహానేత రాజీవ్ గాంధీ అని ఆయన ఆశయాలను, కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా నాయకులు నులకతాటి శ్రీను, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాసం శ్రీకాంత్, మండల నాయకులు తులం ముత్తిలింగం, ఉల్లోజు భరత్, మహిళా నాయకురాలు పానుగంటి మంగ తదితరులు పాల్గొన్నారు.