17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రమణి కళ్యాణం.. భావోద్వేగాల ప్రయాణం

09-11-2025 12:10 AM

దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రమణి కళ్యాణం’. శ్రీనివాస్ రెడ్డి, శ్యామల ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి టైటిల్ లుక్‌ను కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జీవీ ప్రకాశ్‌కుమార్, సామ్ సీఎస్, రంజిత్ జేయకొడి వంటి ప్రముఖులు టైటిల్‌ను లాంచ్ చేశారు. జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే భావోద్వేగాలతో అందమైన ప్రయాణంగా ఈ సినిమా ఉండబోతోందని టీమ్ తెలిపింది.

ఈ చిత్రానికి సూరజ్ ఎస్ కురుప్ మ్యూజిక్ అందిస్తున్నారు. అరవింద్ తిరుకోవెల డీవోపీ, రవితేజ గిరిజాల ఎడిటర్.యువరాజ్ తేజ కాండ్రకోట, రామ్ జగదీశ్, విజయ్ ఆదిరెడ్డి స్క్రీన్‌ప్లేని అందిస్తున్నారు. ‘కోర్ట్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ రామ్ జగదీశ్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లాంటి ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయి.

ఈ చిత్రానికి సంగీతం: సూరజ్ ఎస్ కురుప్; పాటలు: పూర్ణాచారి చల్లూరి; మాటలు: రామ్ జగదీశ్; డీవోపీ: అరవింద్ తిరుకోవెల; ఎడిటర్: రవితేజ గిరిజాల; ఆర్ట్: నానాజీ కచాల; స్క్రీన్‌ప్లే: యువరాజ్ తేజ కాండ్రకోట, రామ్ జగదీశ్, విజయ్ ఆదిరెడ్డి; రచనాదర్శకత్వం: విజయ్ ఆదిరెడ్డి.