calender_icon.png 9 November, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ హీరోతో డేటింగ్ చేస్తా.. పెళ్లి మాత్రం విజయ్‌తోనే!

09-11-2025 12:08:43 AM

రష్మిక మందన్న తాజాగా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక ఇందులో దీక్షిత్ శెట్టి ప్రేయసి ‘భూమా’ పాత్రలో మెప్పించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా రష్మిక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటుచేసిన విద్యార్థులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ వార్తలు, పెళ్లి గురించి వస్తున్న రూమర్స్‌పై మాట్లాడింది.

ఈ ఇంటర్వ్యూకు సంబంధించి వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ విద్యార్థి ‘మీ గురించి ఉన్న నిజమైన రూమర్ ఏంటి?’ అని అడగ్గా.. రష్మిక నవ్వుతూ ‘నేనేం చెప్పగలను? మీ అందరికీ బాగా తెలుసు!’ అంటూ ఫన్నీ బదులిచ్చింది. జీవిత భాగస్వామి ఎలా ఉండాలో చెప్తూ.. ‘ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉన్నా, నా కోసం నిలబడే వ్యక్తి కావాలి. నన్ను లోతుగా అర్థం చేసుకోవాలి.

నా దృష్టి కోణంతో ఆలోచించే మనిషై ఉండాలి. అన్ని పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి నాకిష్టం. నిజమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి. అలాంటి భాగస్వామి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. అవసరమైతే యుద్ధంలో తూటాలనైనా ఎదుర్కొంటా’ అని వివరించింది. ‘మీరు ఎవరితో డేట్ చేయాల నుకుంటారు? ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు?’ అని అడిగితే..

రష్మిక నవ్వుతూ ‘డేట్ అయితే యానిమేషన్ క్యారెక్టర్ ‘నరుటో’ (జపనీస్ సిరీస్‌లో హీరో రోల్)తో చేస్తా.. ఎందుకంటే ఆ పాత్ర నాకు చాలా ఇష్టం. కానీ పెళ్లి మాత్రం విజయ్‌తోనే’ అంటూ అసలు విషయం చెప్పేసింది. రష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం ఇటీవల అక్టోబర్ 3న జరిగిందని వార్తలు వచ్చాయి. దీంతో ‘రష్మిక ఎట్టకేలకు అంగీకరించింద’ంటూ  కంగ్రాట్స్ చెప్తున్నారు.