calender_icon.png 16 May, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జానపద సాహిత్య రారాజు!

12-04-2025 12:00:00 AM

16న ఆచార్య బిరుదురాజు రామరాజు శతజయంతి 

ఆచార్య బిరుదురాజు రామరాజు కేవలం విశ్వవిద్యాలయ ఆచార్యులుగానే కాక కవిగా, రచయితగా, శాసన పరిశోధకుడుగా, గ్రంథ పరిష్కర్తగా, అనువాదకుడుగా, విశిష్ట పురస్కార గ్రహీతగా బహుళ ప్రఖ్యాతి పొందారు. విశేషించి వారికి ఇతర సాహిత్య సంస్థలతోగల సంబంధం వెలకట్టలేనిది. ఉస్మానియా విశ్వవిద్యాలయం చాలామంది ఆచార్యులకు కీర్తి కారకమైనట్లే, రామరాజు కీర్తికి కూడా కారణమైంది. ఓయూ ఒక విద్యాసంస్థ. అందులో రామరాజు 1952లో చేరి 1983లో పదవీ విమరణ చేశారు. ఈమధ్య కాలంలో వారు వివిధ హోదాలలో ప్రిన్సిపాల్‌గా, తెలుగు శాఖాధ్యక్షులు గా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్‌గా పనిచేశారు.

విద్యార్థి దశలో రామరాజు తెలంగాణ విద్యార్థి సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. 1950 మధ్య కాలంలో ‘ఓయూ తెలుగు సాంస్కృతిక సంఘాని’కి అధ్యక్షులుగా పనిచేశారు. 1950లో ‘జాతీయ వి ద్యార్థి సంఘ’ సలహాసభ్యులుగా ఎన్నికైనారు. 1971 మధ్య కాలంలో రామ రాజు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అఖిలభారత విద్యార్థి పరిషత్తు’ శాఖకు అధ్యక్షులుగా ఉన్నారు.  రామరాజు అనగానే మనకు జానపద సాహిత్యం గుర్తుకు వస్తుంది. వారే మొట్టమొదటిసారి తెలుగులో జానపద సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. వారివల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల తెలుగు విభాగా ల్లో జానపద సాహిత్యం మీద పరిశోధనలు కొనసాగడానికి అవకాశం ఏర్పడిం ది. వారి సలహాతోనే ‘జానపద సాహిత్య పరిషత్తు’ అనే సంస్థ ఆవిర్భవించింది. సం స్థ పక్షాన నేటికీ ఉత్తమ జానపద గ్రంథాలకు బహుమతి ప్రదానం జరుగుతున్నది. 

దేశవ్యాప్త గౌరవం

మొత్తం భారతదేశంలోనే జానపద సా హిత్యానికి ఎనలేని గౌరవం తెచ్చిన ఘనకీర్తి రామరాజు వారిదే. రామరాజుకు ఆం ధప్రదేశ్ సాహిత్య అకాడమీ, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, ఆంధ్ర సార స్వత పరిషత్తు వంటి ఉద్ధండ సంస్థలతో ఎంతో అనుబంధం ఉంది. సాహిత్య సంస్థలతోనేకాక విద్యా సంబంధ సంస్థలతోనూ ఆయనకు ఎంతో అనుబంధం కొనసాగిం ది. ఇంచుమించుగా, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోగల అన్ని తెలుగు అధ్యయన మండలుల (బోర్డ్ ఆఫ్ స్టడీస్)లలోనూ వారు సభ్యులుగా పనిచేశారు. ఆయా విశ్వవిద్యాలయాలలో పాఠ్య ప్రణాళికలుగా రూపొందించే విషయంలో వారి సూచనలు, సలహాలు ఎంతగానో తోడ్పడ్డాయి.

రామరాజు ఆంధ్ర (వాల్తేరు) శ్రీ వెంకటేశ్వర (తిరుపతి) విశ్వ విద్యాలయాల తెలుగు అధ్యయన మండలులలో సభ్యులుగానూ ఉన్నారు. అంతేకా క మద్రాసు, మైసూరు, బెంగళూరు, కాశీ, పుట్టపర్తి విశ్వవిద్యాలయాలలో విద్యాసంబంధ అధ్య యన మండలులలో సభ్యులు. 1986 89 మధ్య కాలంలో సురవరం ప్రతాపరెడ్డి (అప్పటి పొట్టి శ్రీరాములు) తెలుగు విశ్వవిద్యాలయం కార్య నిర్వాహక మండలి సభ్యులుగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అకాడమిక్ కౌన్సి ల్ (1958) లో, సెనేట్ (1968)లో, స్థాయి సంఘం (1978)లో సభ్యులుగా చేశారు. ముఖ్యం గా సత్యసాయి విశ్వవిద్యాలయ అకడమిక్ కౌన్సిల్, ఆర్ట్స్ ఫ్యాకల్టీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా సేవలు అందించారు.

నలభై సంస్థలతో అనుబంధం

ఒక లెక్క ప్రకారం ఆచార్య రామరాజుకు సుమారు 40 సంస్థలతో అనుబం ధం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ సంస్థలలో కొన్ని సాహిత్యసంస్థలు కాగా, మరి కొన్ని సాంస్కృతిక సంస్థలు, మతసంస్థలు, పండి త మండలులు కూడా ఉన్నాయి. రామరాజు తమ ధీశక్తికి అనుగుణంగా ‘జానప ద సాహిత్య పరిషత్తు’ (1974)ను స్థాపించి దాని సేవలను రాష్ట్రమంతటా విస్తరింపజేశారు. మత సంబంధ విషయానికి వస్తే, వారు విశ్వహిందూ పరిషత్తు (1980)కు కార్య నిర్వాహక సభ్యులుగా, 1983లో కార్య నిర్వాహక అధ్యక్షులుగా పనిచేసి అ త్యుత్తమ సేవలకుగాను 1983, 1989లలో పరిషత్తు కేంద్ర అధ్యక్షులుగా ఎన్నికైనారు. వారు విశ్వహిందూ పరిషత్తు ఉపాధ్యక్షులుగా ఉండడమేగాక రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నందుకు 10 రోజులు జైలుకు వెళ్లి వచ్చారు.

వారి ధైర్యానికి ఇదొక గుర్తు. దిశానిర్దేశం లేకుండా చతికిల బడిన అనేక సంస్థలకు జవసత్వాలను అందించిన గౌరవం రామరాజుది. వారు కవుల ను, రచయితలను ఎంతో గౌరవించే వారు. వారికున్న శిష్యకోటి ఎవరికీ లే దంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. ఆయన ప్రో త్సాహంతో తెలంగాణలో ఎన్నో సాహిత్య సంస్థలు ఆవిర్భవించాయి. ముఖ్యంగా 1954లో ‘తెలంగాణ రచయితల సంఘాని’కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1957 లో ‘ఆంధ్ర రచయితల సంఘాని’కీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు.

విద్యార్థుల పాలిట కల్పవృక్షం

1956 నుంచి 1966 దాకా శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా ఉండి, సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి సలిపారు. పరిశోధనా పరంగా తెలంగాణలో చెప్పుకోదగిన లక్ష్మణరాయ పరిశోధక మండలి (1964)కి అధ్యక్షులుగా ఉన్నారు. ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ నృత్య అకాడమీ, తెలుగు అకాడ మీ వంటి సంస్థలకు ఎన్నో ఏళ్లుగా సేవలు అందించి వాటి అభివృద్ధికి తోడ్పడ్డారు. వారి చలువ వల్లే ఏపీ  ప్రభుత్వ ఓరియంటల్ మ్యాన్యుస్క్రిప్ట్ లైబ్రరీకి తెలుగు ప్రాం తంలో లభించిన వ్రాతప్రతులు అందా యి.

రామరాజు ఏపీ  స్టేట్ ఆర్కైవుస్ సంస్థ కు సలహామండలి సభ్యులుగా కూడా ఉ న్నారు. హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమై న సాలార్‌జంగ్ మ్యూజియం బోర్డు స భ్యులుగానూ వ్యవహరించారు. రామరాజు తమ జీవితకాలంలో ఎన్నో సభలు ని ర్వహించారు. పరిశోధనా ప్రాజెక్ట్‌లు చేపట్టారు. ఓయూలో ఎన్నో పత్రికలు ప్రా రంభించా రు. జానపద సాహిత్య ప్రదర్శనల శాలలను నెలకొ ల్పారు. తెలంగాణ లో భాషా సాహిత్యాల పునరుజ్జీవనానికి మూలస్తంభంగా నిలిచి, విద్యార్థుల పాలి ట కల్పవృక్షంగా భాసిల్లిన రామరాజు ఒక నిలువెత్తు సాహిత్య సంస్థ అంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

 వ్యాసకర్త: ఆచార్య మసన చెన్నప్ప, సెల్: 9885654381