16 April, 2026 | 2:32 PM

అహ్మదాబాద్‌కు బయల్దేరిన రామ్మోహన్ నాయుడు

12-06-2025 05:31 PM

హైదరాబాద్: అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు బయలుదేరిన AI171 విమానం గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘాని ప్రాంతం సమీపంలో టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో  విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ దేశస్థులు. విమానంలో ఏడుగురు పోర్చుగీస్‌ దేశస్థులు, ఒకరు కెనడియన్‌ ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ప్రయాణీకుల సంఖ్య ప్రాణనష్టంపై అధికారిక ధృవీకరణ ఇంకా వెల్లడించలేదు.  ఈ విమాన ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

ఈ సదర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ...  అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తనను షాక్ గురి చేసిందన్నారు. తాము అత్యంత అప్రమత్తంగా ఉన్నామని, ప్రమాదంపై తనే వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు రామ్మోహన్ వెల్లడించారు. సహాయ బృందాలు ఇప్పటికే ఘటనాస్థిలిలో ఉన్నాయని, అత్యవసర ప్రతిస్పందన సంస్థలను త్వరితంగా మరియు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్ కు రామ్మోహన్ నాయుడు బయల్దేరారు.