calender_icon.png 24 October, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిలో అరుదైన ఖనిజాల శుద్ధి!

24-10-2025 12:57:05 AM

-ఎన్‌ఎఫ్‌టీడీసీ సహకారంతో కొత్తగూడెంలో పైలెట్ ప్లాంట్

-ఒప్పందం చేసుకున్న సింగరేణి, ఎన్‌ఎఫ్‌టీడీసీ

-ఓవర్ బర్డెన్, ఫ్లుయాష్, మట్టిలో రేర్ ఎలిమెంట్స్.. 

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఖనిజ రంగంలో సింగరేణి మరో కీలక అడుగు వేసింది. ఆరుదైన ఖనిజాలను గుర్తించి, ఉత్పత్తి చేసేందుకు వీలుగా సింగరేణి ప్రాంతంలో ఒక పైలట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచ న మేరకు సింగరేణి ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను గుర్తించి, ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ అధికారిక పరిశోధక సంస్థ ఎన్‌ఎఫ్‌టీడీసీ (నాన్ ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్‌మెం ట్ సెంటర్)తో గురువారం సింగరేణి భవన్‌లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పం ద పత్రాలపై సింగరేణి సీఎండీ బలరామ్, ఎన్‌ఎఫ్‌టీడీసీ డైరెక్టర్ బాలసుబ్రమణియన్ సంతకాలు చేశారు.

సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్‌ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికి తెలుసుకోవడానికి, లభించే ఎలిమెంట్స్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్టు బలరామ్, బాలసుబ్రమణియన్ వెల్లడించారు. ఈ ప్రయోగాత్మక ప్లాంట్‌ను కొత్తగూడెం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. సాంకేతిక సహాయాన్ని ఎన్‌ఎఫ్‌టీడీసీ నుంచి తీసుకుంటామని, ఈ ప్లాంట్‌ను త్వరలోనే నిర్మించనున్నట్టు వారు తెలిపారు. ఈ ప్లాంట్‌లో సింగరేణి ఓవర్‌బర్డెన్‌లో, సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం నుంచి వచ్చే ఫ్లుయాష్, ఇతర వేస్ట్ మెటీరియల్స్‌లోనూ లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను గుర్తించి, ఉత్పత్తి చేస్తామని వారు పేర్కొన్నా రు.

ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌టీడీసీ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ లో తాము ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించామన్నారు. కొన్ని కీలక ఖనిజాలు ఓవర్ బర్డెన్‌లోనూ, థర్మల్ విద్యుత్తు కేంద్రం నుంచి వెలువడే ఫ్లుయాష్‌లోనూ గుర్తించామని, కొత్తగా ఏర్పాటు చేయనున్న పైలట్ ప్లాంట్ ద్వారా మరింత సమగ్రమైన సమాచారం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్ర మంలో సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు, జీఎంలు టి.శ్రీనివాస్, రాందాస్, శ్రీనివాసరావు, ఎన్‌ఎఫ్‌టీడీసీ డిప్యూటీ ప్రాజెక్టు డైరె క్టర్ లోకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.