24-10-2025 12:56:35 AM
తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్ కుమార్
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 23(విజయ క్రాంతి): ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలో వలస వచ్చి ఎస్టి హోదాను పొందుతున్న వారి ఎస్టీ జాబితా నుండి తొలగించాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్ కుమార్ డిమాం డ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని దెబ్బ కార్యాలయంలో జాతీయ నాయకుడు బుర్సా పోచయ్యతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
లంబాడా బంజారా, సుగాలీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న జిల్లా కేంద్రంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సభకు ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.