calender_icon.png 31 December, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావితరాలకు రతన్ టాటా జీవితం స్ఫూర్తి

29-12-2025 12:00:00 AM

హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి

ముషీరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): రతన్ టాటా దేశ నిర్మాణాన్ని నైతిక విలువలను వ్యాపార వృద్ధిని మేళ మించిన ఒక ఐకాన్ అని తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణ రెడ్డి అన్నారు. పద్మభూషణ్ రతన్ టాటా 88వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్(టీసీసీ) రాష్ట్ర అధ్యక్షులు డా.రాజ్ నారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ముఖ్య అతిథిగా విచ్చేసి తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు జస్టిస్ డా.గురుజాల రాధా రాణితో కలసి ప్రసంగించారు.

భారత పారిశ్రామిక వేత్తలలో రతన్ టాటా పెంపొందించిన విలువలు భావితరాలకు స్ఫూర్తి ఇస్తాయని అన్నారు. రతన్ టాటా దర్శనీకత, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చిన గ్రేట్ లెజెండ్ అన్నారు. ఈ సందర్బంగా డా.బి.కే ఉమారాణి, మాటలు శశిధర్, సాంబ లలిత, పి.అర్పిత, తిరుపతి కదిరి, మంగళం సావిత్రి, డి.కోమలి కృష్ణారెడ్డి, పద్మ కళావూరి, జ్యోతి, మేకల చంద్రశేఖర రావు, పోరిక అన్నపూర్ణ లకు రతన్ టాటా సేవా రత్న పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొ.అక్బర్ అలీ ఖాన్, డా.కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, ఓయూ ప్రొ.ఏ.పాట్రిక్, ప్రొ.ఆర్.ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.