29-12-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ రూరల్, డిసెంబర్ 28: విద్యార్థుల ఆరోగ్యం పదిలంగా ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారంనగరంలోని బోయపల్లి ఎస్టీ హాస్టల్లో ఎమ్మెల్యే హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థులకు బెడ్షీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ సంస్థ సేవలు ప్రశంసనీయమని అన్నారు.
ముఖ్యంగా పేద, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థుల సంక్షేమానికి రెడ్ క్రాస్ సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ, విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని రెడ్ క్రాస్ సంస్థను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు ఖాజా పాషా, అజ్మత్ అలి తదితరులు పాల్గొని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.