12-08-2025 01:42:40 AM
పత్రికలు కూడా వెళ్లకుండా చేస్తున్న వైనం
ఇస్లామాబాద్, ఆగస్టు 11: ఆపరేషన్ సిం దూర్ వల్ల భారీగా నష్టపోయిన పాకిస్థాన్ భారత్‌పై అక్కసుతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో ఉన్న భారతీయ దౌత్యవేత్తలపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది. ఇస్లామాబాద్‌లో ఉన్న దౌత్యవేత్తల గృహాలకు వార్తాపత్రికలు కూడా వెళ్లకుండా చేస్తోందని విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి.
భారత్ కూడా న్యూఢిల్లీలో ఉం టున్న పాకిస్థాన్ హైకమిషనర్ల ఇండ్లకు వార్త పత్రికలు పంపకుండా తగిన గుణపాఠం చె ప్పింది. ఈ తరహా చర్యలు పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్థాన్ మీద సర్జికల్ స్ట్రుక్స్ చేసింది. ఆ సమయంలో కూడా పాకిస్థాన్ ఇలాగే వ్యవహరించిందని సమాచారం.