calender_icon.png 3 August, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల పంపిణీలో రసాభాస

02-08-2025 02:28:50 AM

  1. బీఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం విమర్శలు
  2. అడ్డుకున్న ఎమ్మెల్సీ దాసోజు, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు
  3. బంజారహిల్స్‌లో ఘటన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఖైరతాబాద్ నియోజకవర్గం లోని బంజారాహిల్స్‌లో ఉన్న బంజారా భవన్‌లో శుక్రవారం జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రసంగిస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, స్థానిక కార్పొరేటర్లు అడ్డుకున్నారు.

గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి అనడంతో.. కేసీఆర్ హయాంలో 6 లక్షల రేషన్ కార్డులు ఇ చ్చాం అని దాసోజు శ్రవణ్ బదులిచ్చారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు తమ సమ స్యలు చెపుతామని ముందుకు రావడంతో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు తమాషా చేస్తున్నారా? అని దానం నాగేందర్ మండిపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.