02-08-2025 02:28:37 AM
మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ‘సీఎంఈ’ సదస్సు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): బ్రెయిన్ డెత్, అవయవ దా నంపై నొవోటెల్ హోటల్‌లో శుక్రవారం మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ‘బ్రెయిన్ డెత్, అవయవ దానం నైతిక, చట్టపరమైన దృక్పథాలు’ అనే అంశంపై సద స్సును నిర్వహించింది. మెడికవర్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ డైరెక్టర్ డాక్టర్ ఘనశ్యామ్ జగత్కర్ ఈ సదస్సును ప్రారంభించారు.
వైద్య పరిజ్ఞానానికి, ప్రజల అవగాహనకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. మోహన్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ లలిత రఘురామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అవయవ దా నంపై అవగాహనను పెంచాలని, సంభావ్య దాతలను నిరుత్సాహపరిచే సాధారణ అపోహలను తొలగించాలని పిలుపునిచ్చారు.
ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌం డేషన్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ చైర్ డాక్టర్ రా హుల్ పండిట్, సిటిజెన్స్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ పిబిఎన్ గోపాల్, మెడికవర్‌లోని సీనియర్ నిపుణులు డాక్టర్ రంజిత్, డాక్టర్ మహమ్మ ద్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్, డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, డాక్టర్ అజయ్ షిండే వంటి వక్త లు చట్టపరమైన అంశాలు, బ్రెయిన్ డెత్‌ను క్లినికల్‌గా ప్రకటించడం, నైతిక సమస్యలు,
దాతల లాజిస్టిక్స్, నార్మోథెర్మిక్ పెర్ఫ్యూజన్ వంటి అత్యాధునిక సాంకేతిక అంశాలను గురించి వివరించారు. కేవలం వైద్య అవసరాలకే కాకుండా సామాజిక అవసరాలకు కూడా బ్రెయిన్ డెత్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని ఈ ప్రస్తావించారు. మెడికవర్ ఆసుపత్రుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హరి కృష్ణ, పూర్ణిమ కాంబ్లే (ఫాక్స్ మం డల్, అసోసియేట్స్) న్యాయ నిపుణులు, ట్రాన్స్‌ప్లాంట్ కో -ఆర్డినేటర్లు పాల్గొన్నారు.