calender_icon.png 5 May, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డు నిబంధనను తొలగించాలి

05-05-2025 04:29:54 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో రేషన్ కార్డు తప్పనిసరి నిబంధనలను తొలగించాలని బిజెపి నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కుటుంబాల నుండి అనేకమంది వేరుపడి జీవిస్తున్నారని అయితే ఇప్పటివరకు కొత్తగా ఏర్పడ్డ కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఉమ్మడి కుటుంబంలోనే కొనసాగుతున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో వేరుపడ్డ కుటుంబాలకు ఇండ్లు మంజూరు అయ్యే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఆర్వోఎఫ్ఆర్ భూములను పరిగణలోకి తీసుకోకుండా గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు.

ఉపాధి కోసం కార్లు, ట్రాక్టర్లు కొనుక్కుంటే వారిని ధనికులుగా గుర్తిస్తూ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు లేనిపోని కొర్రీలు పెడుతూ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. అలాగే గ్రామాలు, పట్టణాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఈ మేరకు కేసముద్రం తహసిల్దార్ ఎర్రయ్య, ఎంపీడీవో కార్యాలయంలో బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, జిల్లా కోశాధికారి ఓలం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రామడుగు వెంకట చారి, మండల ప్రధాన కార్యదర్శులు నాగేశ్వర చారి, బోనగిరి ఉపేందర్, మల్యాల రాములు, లెంకలపల్లి శ్రీనివాస్, మంగిశెట్టి నాగయ్య, బచ్చు లక్ష్మీనారాయణ, బానోతు సంపత్, జాటోత్ సురేష్, పోలేపల్లి సంపత్ రెడ్డి, బొల్లోజు వీరాచారి, చెల్లగొల్ల వెంకటేష్, సింగంశెట్టి మధుకర్ పాల్గొన్నారు.