calender_icon.png 6 May, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆత్మ గౌరవాన్ని భంగపరిచే అందాల పోటీలను రద్దు చేయాలి

05-05-2025 07:23:36 PM

మహిళా సంఘం (ఐద్వా) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు డి సీతలక్ష్మి..

భద్రాచలం (విజయక్రాంతి): మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఈనెల 7వ తేదీన హైదరాబాదులో నిర్వహించే మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి(Aidwa District President Seethalakshmi) డిమాండ్ చేశారు. ఐద్వా భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అందాల పోటీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, హత్యలు నియంత్రించే దానిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీల పేరుతో రూ.255 కోట్లు ఖర్చు పెడుతున్నారు.

మీరు హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయండి. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చుపెట్టే డబ్బు చదువుకునే అమ్మాయిలకు, ఉపాధి కల్పించండి. మీరు జరుపుతున్న అందాల పోటీలు ఎవరికోసం ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. ఈ అందాల పోటీలకు రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయండి, ప్రతి కుటుంబంలో మహిళలకు రూ.2500  ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షురాలు నాదెళ్ళ లీలావతి, ఐద్వా పట్టణ కమిటీ సభ్యులు జి రాధ, జి నాగలక్ష్మి, డి కనక శ్రీ, కే రమణ, సి హెచ్ హైమావతి, టీ లక్ష్మి,గంగ, తదితరులు పాల్గొన్నారు.