calender_icon.png 5 May, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ వినియోగించుకోండి

05-05-2025 07:07:46 PM

నిర్మల్ (విజయక్రాంతి): జూన్ 14న జరుగబోవు జాతీయ లోక్ అదాలత్ దృష్టిలో ఉంచుకుని సోమవారం జిల్లా ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్(District SP Janaki Sharmila IPS) జిల్లాలోని పోలీస్ అధికారులతో, కోర్టు పోలీస్ అధికారులతో ఆన్లైన్ లో దిశా నిర్దేశాలు చేసారు. వివాదాలు, రాజీ పడే క్రిమినల్ కేసులు, పెండింగ్‌లో ఉన్న టూ వీలర్ & ఫోర్ వీలర్ చలాన్ కేసులు, పెట్టీ కేసులు మొదలైన వాటికి సంభందించిన కేసులను సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

కక్షిదారులందరికి సమాచారం అందించి ఈ సదవకాశాన్ని వినియోగించుకావాలని తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో కేసు పరిష్కారం ద్వారా వారి యొక్క సమయం, డబ్బును ఆదా చేసుకోగలరనీ తెలపాలన్నారు. ఈ లోక్ అదాలత్ లో పరిష్కారానికి అవకాశం ఉన్న కేసుల వివరాలు తయారు చేసుకుని తగిన వారందరికీ సమాచారం అందేలా చూడాలని తెలియజేసారు. ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేల వారికి కేసుల గురించి వివరించాలని తెలిపారు.