05-05-2025 06:50:31 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో వివిధ వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉపేందర్ గౌడ్(Congress Party President Upender Goud) స్పష్టం చేశారు. అభివృద్ధి పనులలో సోమవారం పట్టణంలోని 21వ వార్డులో 6 లక్షల ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పట్టణంలో 24 వార్డుల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా తెలుసుకుని ఏ వార్డులో అభివృద్ధి పనులు అవసరమున్నాయో స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. పట్టణంలో ప్రతి వార్డులో మంచినీటి సౌకర్యం, డ్రైన్స్, రోడ్లు నిర్మాణం వంటివి చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఎండి జమీల్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సోత్కు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి ఎండి సుకూర్, రాచర్ల రవి, తుంగ పిండి విజయ్, బండి శంకర్ గౌడ్, బుర్ర ఆంజనేయులు గౌడ్, సేవాదళ్ పట్టణ అధ్యక్షులు సోతుకు ఉదయ్, రావుల శ్రీనివాస్, ఆలం శంకర్, కొత్తపల్లి రాయమల్లులు పాల్గొన్నారు.