05-05-2025 06:57:20 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించే సరస్వతీ పుష్కరాల(Saraswati Pushkaram)లో ప్రతిరోజు యాగాలు నిర్వహించడం జరుగుతుందని కాలేశ్వరం దేవస్థానం ఈవో మహేష్ తెలిపారు. మొదటిరోజు శ్రీ దత్తాత్రేయ హోమం. ఈ హోమం చేయడం వల్ల గురువుల అనుగ్రహం కలుగుతుందని, మన సంకల్పాలు నెరవేర్చకోవడం కొరకు కర్త వీర్యార్జున హోమము చేయడం జరుగుతుందని, 2వ రోజున సంకష్టహర గణపతి హోమం సంకష్టహర చవితి మన కష్టాలు ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ హోమం చేయడం జరుగుతుందని, 3వ రోజున హైగ్రీవ శ్రీస్వయంవరం పార్వతి హోమం ఈ హోమం చేయడం వల్ల మేధాశక్తి, జ్ఞాపకశక్తి పెరగడానికి హైగ్రీవ హోమం, వివాహం కొరకు స్వయంవర పార్వతి హోమం చేయడం జరుగుతుందని, 4వ రోజున అరుణ పుత్రకామేష్టి హోమం, ఆరోగ్యం కొరకు అరుణ హోమం, సంతానం కొరకు పుత్రకామెస్టి హోమం, 5వ రోజున మేధా దక్షిణామూర్తి మహా అమృత మృత్యుంజయ హోమం, ఈ హోమం వల్ల ఉన్నత చదువు విదేశీ యోగం విదేశీ చదువు కొరకు మేధా దక్షిణామూర్తి హోమం, గండాలు అపమృత్య దోషాలు తొలగిపోవుట కొరకు అమృత మృత్యుంజయ హోమం.
6వ రోజున మాన్యసుత కాలభైరవ హోమం ఈ హోమం చేయడం వల్ల ఆత్మస్థైర్యం, మనోధైర్యం, శక్తి పెరుగుటకు మాన్యసుత హోమం వల్ల కలుగుతుందని, దోష నివారణకు, శత్రుసంహారానికి, దుర్ఘటనల నుండి రక్షణకు పనులు పట్టదులతో వేగంగా అవడానికి కాలభైరవ హోమం, 7వ రోజున సుదర్శన హోమం ఈ హోమం చేయడం వల్ల దుష్ట శక్తులు, దుర్గంధాలు, తీవ్రమైన రోగాలు, మానసిక సంఘర్షణలు, శత్రు దోషాలు, దృష్టి దోష నివారణ, వాస్తు దోష నివారణ కోసం ఈ సుదర్శన హోమం, 8వ రోజున శ్రీ సూక్త హోమం ఈ హోమం చేయడం వల్ల ధన ధాన్య ఐశ్వర్య ప్రాప్తి కొరకు, కుటుంబంలో దారిద్రం, దురదృష్టం, ఆర్థిక ఇబ్బందులు తొలగుటకు, వ్యాపారం లేదా ఉద్యోగంలో అభివృద్ధి కొరకు, పితృ దోష నివారణ కోసం ఈ హోమం చేయడం.
9వ రోజున పురుష సూక్త హోమం ఈ హోమం చేయడం వల్ల గ్రహదోషాలు, పితృ దోషం, వాస్తు దోషం, దీర్ఘాయువు, శరీర ఆరోగ్యం, ఆర్థిక సంపద, ఆహార సంపద, ఆయురార్థం పెరగడానికి ఈ పురుష సూక్త యాగం చేయడం జరుగుతుందని, 10వ రోజున నవగ్రహ శ్రీ మత్స్య హోమం, నవగ్రహ పీడలు తొలగుటకు, శత్రు సంహారం కొరకు, అపాయ నివారణ భూత ప్రేత పీడల కొరకు దురాత్ముల ప్రభావం, చెడు దృష్టి నుండి రక్షణ, భయం ఆందోళన మానసిక సమస్యల నుండి బయటపడడానికి నవగ్రహ శ్రీ మత్స్య హోమం చేయడం జరుగుతుందని, 11వ రోజున శ్రీ రుద్ర హోమం ఈ హోమం శరీరంలో ఉన్న వ్యాధి పీడలు తొలుగుట దీర్ఘాయువు కలుగుట, ధన ధాన్య ఐశ్వర్య ప్రాప్తి కొరకు ఈ హోమం చేయడం జరుగుతుంది.
12వ రోజున చండీ హోమం ఈ హోమం కార్యసిద్ధి అన్ని విషయాలలో ఎదుగుదల మానసిక శాంతి, ధైర్యం, ఆత్మస్థైర్యం, అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలు విపత్తుల నివారణ కొరకు ఈ హోమం చేయడం జరుగుతుందని వేద పండితులు తెలిపారు. ఈ 12 రోజుల సరస్వతి పుష్కరాలలో జరిపే హోమం యాగాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని యాగాలు హోమాలలో పాల్గొనే భక్తులు ఒకరోజు యాగానికి రూ.3000 దేవస్థానం కౌంటర్లో చెల్లించి రసీదు తీసుకోవాలని, ఒక టికెట్ పై దంపతులకు అవకాశం ఉందని పూజా సామాగ్రి దేవస్థానం సమకూర్చుస్తుందని ఏరోజైతే హోమాలు చేస్తారో వారు నేరుగా గాని లేదా ఈ సెల్ నెంబర్ 9676705067 ద్వారా సంప్రదించాలని ఈవో తెలిపారు.