05-05-2025 07:18:10 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో ఆదివారం రాత్రి వీచిన బారి ఈదురు గాలులు, వర్షాలకు కేకే-5 ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో నివాసముండే బానోత్ కుమార్-కమల దంపతుల ఇంటిపై బారి వృక్షం విరిగి పడటంతో ఇల్లు, రేకులు, గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకుడు రాయబారపు కిరణ్ వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం బాధిత కుటుంబం ఇబ్బందులను మండల తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్ళగా స్పందించిన అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాంగ్రెస్ నాయకులు కిరణ్, పెద్దిరాజు, సురేందర్, సుజిత్, రవికిరణ్, మహేష్, అశ్రఫ్, కిరణ్, సతీష్, సోహైల్, చింటూ, సమీర్ లు పాల్గొన్నారు.