calender_icon.png 6 May, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సమ్మె ద్వారా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

05-05-2025 07:03:25 PM

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు..

మందమర్రి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న 4 లేబర్ కోడులను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కార్మికసంఘాలు ఈ నెల 20న ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(CITU) ప్రధాన కార్యదర్శి మంద నరసింహరావు ఆన్నారు. ఏరియాలోని కాసిపేట-2 గనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. నూతన లేబర్ కోడ్ లతో కార్మికులకు హక్కులనేవి లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బిజెపి కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తుందని కార్మికులకు కొత్త హక్కులు ఇవ్వకపోగా చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కులను తీసివేసేలా కొత్తకోడ్ లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు. నూతన చట్టాలు అనలు జరిగితే భవిష్యత్తులో పరిశ్రమలను నష్టాల సాకులు చూపెట్టి కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ కు  ఎసరు పెట్టే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సమ్మె చేస్తే కార్మికులకు, సమ్మె పిలుపు నిచ్చిన కార్మిక సంఘాలకు  పెనాల్టీ వేసే విధానంను కార్మికులు కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించి తిప్పికొట్టాలని ఆయన కోరారు.

కార్మిక సంఘాల మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్న కార్మికుల హక్కులను కాపాడ డానికి ఒకే తాటిపైకి వచ్చి మే 20న జరుగు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని కార్మికులు ముందుండి రైతుల స్ఫూర్తితో లేబర్ కోడ్ లు రద్దు అయ్యే వరకు ఆందోళనలు ఉదృతం చేయాలన్నారు. సింగరేణి లాభాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటాలు తీసుకుంటున్నాయే తప్ప కొత్త గనులను కేటాయించి భవిష్యత్తును పెంచుదామని చూడడం లేదని బకాయిలు సైతం పేరుకుపోతున్న పట్టించుకోవడంలేదని ఆయన  విమర్శించారు.

కార్మికులను కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తూ ఐక్య పోరాటాలకు వారధిగా ఉన్న సిఐటియు సొంతింటి కళ, పేర్క్స్ పై ఐటి మాఫీ, మారు పేర్లతో పాటు ఇతర అంశాలపై కార్మికులకు కల్పిస్తున్న అవగాహన, పోరాటాన్ని గమనించిన పలువురు మైనింగ్ స్టాప్, ఓవర్ మెన్ కార్మికులు మహేష్, రాజేష్, అరవింద్, టెక్నికల్ స్టాఫ్ ఫోర్ మెన్ నవీన్, ఎలక్ట్రిషన్ మధుకర్ తో పాటు సతీష్, సూరం మనోజ్, నాగుల మురళి, చిలక రాజేష్ లు యూనియన్ లో చేరగా వారికి కండువాలు కప్పి యూనియన్ లోకి సాదరంగా ఆహ్వానించా రు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి, అల్లి రాజేందర్, పిట్ సెక్రటరీ బుద్దే సురేష్, ఆర్గనైజర్ విద్యాసాగర్ షిఫ్ట్ ఇంచార్జ్ నామని సురేష్, కార్తీక్, శ్రావణ్, సీనియర్ నాయకులు అలవాల సంజీవ్ లు పాల్గొన్నారు.