05-05-2025 06:55:13 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): నగరంలోని అంబర్‌పేట పైవంతెనను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఆటహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. గోల్నకా నుంచి అంబర్‌పేట వరకు 1.7 కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ కు రూ.335 కోట్లు ఖర్చు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.
ఇదెలా ఉండగా... అంబర్‌పేట పైవంతెన ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నాయకులు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేయడంతో వారికి పోటాపోటీగా కాంగ్రెస్ నాయకులు కూడా నినాదాలు చేశారు. దీంతో గడ్కరా కాన్వాయ్ ను అడ్డుకున్న ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు చెదరగొట్టారు.