calender_icon.png 31 July, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బియ్యాన్ని అమ్ముకుంటే రేషన్ కార్డు రద్దు

31-07-2025 12:31:38 AM

-కార్డులు రాకపోతే అర్హులు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలి 

- కలెక్టర్ రాజర్షి షా 

బోథ్, జూలై 30 (విజయక్రాంతి): రేషన్ షాపుల ద్వారా పేదవారికి అందించే సన్న బియ్యాన్ని ఎవరైనా అమ్ముకుంటే వారి రేషన్ కార్డులను రద్దు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. బుధవారం ఇచ్చోడ, బోథ్ మండలం లోని రైతు వేధికలలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు రేషన్ కార్డుల పత్రాలను అందజేశారు.

అనంతరం కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారికి రేషన్ కార్డులు రాకపోతే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పేదల నుండి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసే వారిపై సైతం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డులు వలన పేదలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దొడ్డు బియ్యం కాకుండా సన్నబియ్యం పంపి ణీ చేస్తుందని, లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఛైర్మెన్ మల్లెపూల నర్సయ్య, ఆత్మ ఛైర్మెన్ రాజు యాదవ్, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గంగా రెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి,  ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ సుభాష్ చందర్, ఎంపిడిఓ, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.