calender_icon.png 1 August, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలశక్తితో పిల్లలకు మేలు

31-07-2025 12:29:46 AM

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, జూలై 30 (విజయక్రాంతి): సొన్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాల శక్తి కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహే శ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం  బాలశక్తి కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ బాలశక్తి కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అనేక అంశాల పట్ల అవగాహన ఏర్పడుతుందని, ఆరోగ్య పరంగా, విద్య పరంగా చైతన్యవంతులు అవుతారని అన్నారు.

అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆస్ట్రానమీ ల్యాబ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్యాధికారి డా.రాజేందర్ గారు, ఇంచార్జి డీఈవో, లీడ్ బ్యాంక్ మేనే జర్, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, నాయకులు హరీష్ రెడ్డి, ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు, విద్యార్థులుతోపాటు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.