calender_icon.png 31 July, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన పేదవారికి రేషన్ కార్డులు

30-07-2025 01:06:31 AM

ఎమ్మెల్సీ దండే విఠల్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై ౨౯ (విజయక్రాంతి): అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని  ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మంగళవారం జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే,  ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులను పం పిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అర్హత గల ప్రతి లబ్ధిదారులకు రేషన్ కార్డు లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేషన్ కార్డు పేదవారికి వరం లాంటిదని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన పేదలకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యంను ఉచితంగా అందిస్తుందని, ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు.

సన్న బియ్యం పంపిణీ ద్వారా కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రేషన్ కా ర్డు దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, రేషన్ కార్డులలో పేర్ల మార్పులు, చేర్పులు కొరకు సమీప మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసినట్లయితే తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులై న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో చాలా దరఖాస్తులు రేషన్ కార్డు కొరకు వచ్చేవి అని, వచ్చే నెల నుండి కొత్త రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం  మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంక టి, తహసిల్దార్ భూమేశ్వర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంజద్ పాషా పాల్గొన్నారు.