30-07-2025 01:07:43 AM
కుమ్రం భీం అసిఫాబాద్, జూలై ౨౯ (విజయక్రాంతి): జిల్లా గురుకుల విద్యాలయా ల్లో సీటు ఇప్పిస్తానని 26 మంది అమాయక విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఓ వ్యక్తి మం త్రి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన సం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తానని ఆసిఫాబాద్ కు చెందిన ఓ వ్యక్తి రాష్ట్ర మంత్రి సీతక్క అనుచరుడుని అని చెబుతూ సిర్పూ ర్ కాగజ్నగర్ కౌటాల పలు మండలాల్లోని విద్యార్థుల నుండి ఒక్కో సీటుకు 20వేల చొప్పున మాట్లాడుకున్నాడు.
అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి వద్ద 10 వేల రూపాయల చొప్పు న తీసుకున్న వ్యక్తి తీరా సీటు ఇప్పించాలని ఒత్తిడి చేయడంతో మంత్రి పేరుతో ఒక లెట ర్‌ను చూపించి నమ్మబలికాడు.విద్యార్థుల నుండి డబ్బులు తీసుకోవడమే కాకుండా వారు చదువుతున్న పాఠశాలల నుండి టీసీ లు సైతం తీసుకోమని చెప్పడంతో వారు టీసీలు తీసుకొని సిద్ధంగా ఉన్నారు.
అటు గురుకులాల్లో అడ్మిషన్ దొరకక పాఠశాలలో చేరలేక ఎక్కడ చదవాలో అర్థం కాక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సదరు వ్యక్తిపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.