calender_icon.png 1 August, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంలో కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటన

30-07-2025 01:06:00 AM

మహదేవపూర్, (భూపాలపల్లి) జూలై 29 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పర్యటించారు. కాళేశ్వరంలోని ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని అక్షయ భౌతిక శాస్త్రంపై న్యూటన్ సిద్ధాంతాలపై, దశావతారం తో వండర్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ లో పాల్గొనడంతో ఈ విద్యార్థిని చేసిన భౌతిక శాస్త్రంలో దశావతారం ప్రదర్శన ఆకట్టుకుందని అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వండర్ బుక్ ఆఫ్  వరల్ లో స్థానం దక్కించుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు. 

అనంతరం మహదేవపూర్ ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు కను బొమ్మలతో  చేసిన కోడింగ్ వీక్షించారు.   అక్షయ్ కు వండర్ బుక్ ఆఫ్ వరల్ రికార్డు ప్రశంస పత్రాన్ని,  మెడల్ ను అందజేశారు. ఈ పాఠశాలలోనే ఇటీవల ముగ్గురు విద్యార్థులు కోల శాన్వి, గంట హరిచందన, నాగుల తులసి విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలలకు ఎంపికైన సందర్భంగా విద్యార్థినీలను సన్మానించారు.  కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ సిద్ధం అరుణ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు రాజేందర్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, డాక్టర్ సుస్మిత, దేవస్థానం ఈవో మహేష్, తాసిల్దార్ రామారావు ఎంఈఓ ప్రకాష్ బాబు, మడక మధు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ అవినీతిపై విచారణ చేపట్టాలి కలెక్టర్, పీడీలకు ఫిర్యాదు చేసిన గుంటూరుపల్లి గ్రామస్తులు.

చిట్యాల,జూలై 29(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల అవినీతిపై విచారణ జరిపించాలని ఆ గ్రామస్తులు మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, పీడీలకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో సుమారు 40 లక్షల రూపాయల అవినీతి జరిగిందని తెలిపారు. తమకు తెలియకుండా నిధులను మాజీ ప్రజా ప్రతినిధి సొంత అకౌంట్ కు మరలించుకున్నారని లేఖలో పేర్కొన్నారు.  సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్నెం శ్రీనివాస్ రావు,సదా శివ రావు,మెట్టు శేషగిరి రావు,శివ రామ కృష్ణ,ముద్దన నాగరాజు, శ్రీనివాస్, శ్రీకాంత్, ధనుష్, పువాటి హరికృష్ణ, సతీష్ తదితరులు ఉన్నారు.