18-10-2025 12:09:35 AM
రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్
కామారెడ్డి,(విజయక్రాంతి): బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బిసి సంఘాలు 2025 అక్టోబర్ 18న (శనివారం) తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్‌కు కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగం సురేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పూర్తి సంఘీభావం వ్యక్తం చేస్తుందని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ ల సాధన పోరాటంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అని అన్నారు. బీసీలకు 42% రేజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం అన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం మా వంతు కృషి చేస్తామన్నారు. బీసీ బంద్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు అందరు కూడా పెద్దఎత్తున బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.