calender_icon.png 18 October, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత, కొత్త రాజకీయాలకు ఎంతో బేధం

18-10-2025 12:09:15 AM

రాష్ట్ర ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

ముషీరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): పాత, కొత్త రాజకీయాలకు ఎంతో బేధం ఉందని మాజి మంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నా రు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కనిగిరి సత్యనారాయణ ప్రసాద్ రచించిన ’ఈ 21వ శతాబ్దపు కొత్త రాజకీయ నీతి’ పుస్తకాన్ని ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. నూతన తరానికి కొత్త కాన్సెప్ట్ ను ఈ పుస్తకం ద్వారా అందించడం శుభపరిణామం అని, రచయితను అభినందించారు.

నేటి రాజకీయాల్లో తమ లాంటి నాయకులు ఇమడ లేక పోతున్నారని వాపోయారు. ఈ పుస్తకాన్ని ప్రసా ద్ చాలా ధైర్యంగా రాశారని కొనియాడారు. పాత కొత్త రాజకీయాలకు పోల్చి చూస్తే చాలా భేదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొ. సుబ్బారాయుడు, ప్రొ. మహేందర్ మిలేని, సీనియర్ జర్నలిస్ట్ అరవింద్, న్యాయవాది శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.