03-10-2025 10:26:03 PM
టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
హుజూర్ నగర్,(విజయక్రాంతి): యువత స్వయం ఉపాధి కల్పించుకొని వ్యాపార రంగాలలో రాణించి పది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. శుక్రవారం వేపల సింగారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బుజ్జమ్మ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించి మాట్లాడారు.
యువతి యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి కల్పించుకొని వారి కాళ్లపై వారు నిలబడి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు అవకాశం కల్పిస్తున్నారని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.పిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం అత్యంత నమ్మకంతో వాహనదారులకు సేవలు నాణ్యమైన అందించాలన్నారు.