calender_icon.png 4 October, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఐ గా పదోన్నతి పొందిన నారాయణగౌడ్

03-10-2025 10:29:56 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో  గత సంవత్సరకాలం గ  విధులు నిర్వహి స్తున్న ఏ ఎస్ఐ కే.నారాయణ గౌడ్ ఇటీవల రాచకొండ సీపీ ప్రకటించిన ప్రమోషన్ లో ఎస్ఐ గా పదోన్నతి పొందినాడు. మేడిపల్లి సీఐ  గోవిందరెడ్డి పదోన్నతి  పొందిన నారాయణ గౌడ్ ను అభినందించి  సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పదోన్నతి పొందడం అంటే ప్రజలకు ఇంకా దగ్గరవుతూ సేవ చేయడమే అన్నారు. ఈ  కార్యక్రమంలో మేడిపల్లి ఎస్ఐ లు మరియు సిబ్బంది పాల్గొని నారాయణ గౌడ్ ను అభినందించడం జరిగింది.