calender_icon.png 4 October, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సుందరేశ్వరుల దుర్గాభవానీల పట్టాభిషేకం

03-10-2025 10:20:00 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్‌ రూరల్ మండలం నగునూర్‌లోని పరివార సమేత శ్రీ దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న దుర్గాభవానీ శరన్నవరాత్రుల చివరి రోజైన శుక్రవారం దుర్గాభవానీ అమ్మవారు అర్ధనారేశ్వర అలంకరణలో నంది, సింహ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. సుందరేశ్వరుల, దుర్గాభవానీల పట్టాభిషేకం, రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్‌ కుమార్, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావులు ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటి బాధ్యులు ఈ సందర్భంగా వారిని అమ్మవారి శేషవస్త్రాలతో సన్మానించి అమ్మవారి ప్రసాదం అందజేసారు.  భక్తులు అమ్మవారిని దర్శించుకుని చీరేసారే పెట్టి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు సౌందర్యలహరి పారాయణం చేశారు.