calender_icon.png 27 September, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన ఆర్డిఓ పార్థసింహారెడ్డి

27-09-2025 08:43:05 PM

జ్యోతి ప్రజ్వలన చేసిన కమిషనర్ మహేష్

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో(ఏటిసి) అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలో ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో శనివారం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపాల్ రూపా నాయక్, ఇన్స్పెక్టర్ శేఖర్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన(ఏటీసీ) అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని ఆర్డిఓ పార్థ సింహారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేష్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ పార్థ సింహారెడ్డి మాట్లాడారు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువతకు మెరుగైన శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్డిఓ పార్థ సింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మా రెడ్డి రజిత వెంకట్రామిరెడ్డి, మాజీ జెడ్పిటిసిలు, సామెల్, ఉషా గౌడ్, కాంగ్రెస్ మండల పట్టణ, అధ్యక్షులు, కురుమ సాయిబాబా, పాఠకుల వినోద్ గౌడ్, విద్యాసాగర్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నాగం శంకరయ్య, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.